ఎండగడుదాం | - | Sakshi
Sakshi News home page

ఎండగడుదాం

Sep 28 2025 6:52 AM | Updated on Sep 28 2025 6:52 AM

ఎండగడ

ఎండగడుదాం

● కమిటీలకే పూర్తి బాధ్యత ● పొరబాట్లు జరగనివ్వను ● విద్య, వైద్యం నిర్వీర్యం

పుంగనూరు నుంచే కార్యక్రమం

ప్రారంభం

గ్రామస్థాయి నుంచే కమిటీలు ఏర్పాటు

ఎర్రాతివారిపల్లె విస్తృత స్థాయి సమావేశం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కూటమి అరాచకాలను

కూటమి అరాచకాలను ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ నడుంబిగించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల సైన్యాన్ని సిద్ధం చేసేందుకు ఉపక్రమించింది. శనివారం పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రెడ్‌బుక్‌ ఆగడాలను డిజిటల్‌ బుక్‌లో నమోదు చేయించి చట్టం ముందు నిలబెట్టే చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, తిరిగి జగనన్న పాలనను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

పుంగనూరు: వైఎస్సార్‌సీపీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకుంటూ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాము ఖి నిర్వహించే కార్యక్రమాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి రాగానే పుంగనూరు నుంచి ప్రారంభిస్తారని మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పార్టీకి 18 లక్షల మంది క్రియాశీలక సైన్యం ఉందని ధీమా వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, యర్రాతివారిపల్లెలో శనివారం వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పుంగనూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఇంకా తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నిసార్‌ అహ్మద్‌, వెంకటేగౌడ్‌, డాక్టర్‌ సునీల్‌కుమార్‌, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్‌, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ‘పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యత. పుంగనూరు నియోజకవర్గంలోని 112 గ్రామాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖాముఖి మాట్లాడుతారు. ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి వచ్చాక ఈ కార్యక్రమం ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ స్క్యాన్‌ చేస్తే డిజిటల్‌ నోట్‌బుక్‌లో అన్ని విషయాలు నమోదు చేసుకోవచ్చు’ అని అన్నారు.

ఆకేపాటి అమరనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో జరిగిన పొరపాట్లు ఈ సారి జరగనివ్వను. ఈసారి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక మీ ద్వారానే ప్రభుత్వం నడవనుంది’ అని చెప్పారు.

మాజీ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. ‘ఈవీఎంల గాలిలో కూడా పుంగనూరు ప్రజలు పెద్దిరెడ్డిని గెలిపించారు. మీరు జగనన్న సైనికులు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యాన్ని నిర్వీర్యం చేసింది’ అని ధ్వజమెత్తారు. రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాకు ఆదర్శం. కార్యకర్తలను ఏ విధంగా చూసుకోవాలో పెద్దిరెడ్డే నిదర్శనం. మనం పుంగనూరుని రోల్‌మోడల్‌గా తీసుకుందాం. మా నియోజకవర్గంలో కూడా ఇదే ఫార్ములాను అమలు చేస్తాను’ అని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేగౌడ, సునీల్‌, కురుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డితో పాటు అకేపాటి అమరనాథరెడ్డి, సమన్వయకర్తలు నేదురుమల్లి రామకుమార్‌రెడ్డి, రాజేష్‌, విజయానందరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్‌ ఫకృద్ధిన్‌షరీఫ్‌ పాల్గొన్నారు.

ప్రతి నెలా ‘జగనన్న’తో ముఖాముఖి’

దోచుకుంటున్న కూటమి

ముందుగా సజ్జల మాట్లాడుతూ..‘ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. కార్యకర్తల పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. వైఎస్‌ జగన్‌ చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రదారులం కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని దోచుకుంటోంది. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఉన్నాము అని చెప్తున్నారు’ అని అన్నారు. ఓట్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ వైఎస్సార్‌సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. బూత్‌ లెవల్‌లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలి. ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా దాడికి రెడ్‌ బుక్‌ ఉపయోగించారు. మనం డిజిటల్‌ బుక్‌ను లాంచ్‌ చేశాం’ అని చెప్పారు.

ఎండగడుదాం1
1/1

ఎండగడుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement