అఖిల భారత ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ యాత్ర ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అఖిల భారత ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ యాత్ర ప్రారంభం

Sep 27 2025 4:29 AM | Updated on Sep 27 2025 4:29 AM

అఖిల భారత ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ యాత్ర ప్రారంభం

అఖిల భారత ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ యాత్ర ప్రారంభం

తిరుపతి సిటీ: ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో అఖిల భారత ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు తిరుపతి గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ సతీందర్‌ దాహియా ట్రెక్కింగ్‌ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుంచి అక్టోబర్‌ 2వ తేదీవరకు 8 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ యాత్రలో పాల్కొంటారని తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, అండమాన్‌, పాండిచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా నుంచి మొత్తం 509 ఎన్‌సీసీ క్యాడెట్లు, 15 అసోసియేట్‌ అధికారులు ఈ ట్రెక్కింగ్‌ యాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. శేషాచలం బయోస్పియర్‌ రిజర్వ్‌, పరిసర ప్రాంతాల్లో ఈ ట్రెక్కింగ్‌ సాగుతుందని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement