
పరిశ్రమల నుంచి విరాళాలు తీసుకోండి
తిరుపతి అర్బన్: అంగన్‌వాడీ ప్రాజెక్టు పరిధిలో స్కూల్స్ శిథిలావస్థకు చేరుకుంటే, వాటి మరమ్మతులకు మీ పరిధిలోని పరిశ్రమల నుంచి విరాళాలు సేకరించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సీడీపీవోలకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నెలవారీ సప్లిమెంటరీ న్యూట్రీషన్ ఫుడ్ కమిటీ సమావేశం చేపట్టారు. జేసీ మాట్లాడుతూ పరిశ్రమలు ఇచ్చిన విరాళాల నుంచి అంగన్‌వాడీ స్కూల్స్‌ను బాగుచేయించుకోవాలని సూచించారు. బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, బాలామృతం, న్యూట్రీషన్ కిట్లు ఎలా ఉన్నాయో తరచూ పరిశీలన చేపట్టాలని ఐసీడీఎస్ పీడీ వసంతబాయిని ఆదేశించారు. గుడ్లు సకాలంలో అందించకుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అంగన్‌వాడీ స్కూల్‌కు రేషన్ దుకాణం దూరంగా ఉంటే రీమ్యాపింగ్ చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో శేషాచలం రాజు హాజరయ్యారు.
మద్యం మత్తులో
బ్యారేజ్‌లో దిగి...
వాకాడు : వాకాడుకు చెందిన పనబాక ప్రసన్న అనే యువకుడు శుక్రవారం మద్యం మత్తులో స్వర్ణముఖి బ్యారేజ్ గేట్ల రోప్‌లను పట్టుకుని లోపలికి దిగాడు. స్థానికుల వివరాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం బ్యారేజ్ గేట్ల బెడ్‌పై పడుకుని నిద్రించడం అందరిని కలవరానికి గురిచేసింది. అగ్నిమాప క శాఖ అధికారులు, సిబ్బంది నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం యువకుడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు.

పరిశ్రమల నుంచి విరాళాలు తీసుకోండి