
సజ్జల రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం
రేణిగుంట : చిత్తూరు ఉమ్మడి జిల్లా పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి వందేభారత్ రైల్లో రేణిగుంట రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించి, స్వాగతం పలికారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి నారాయణస్వామి వచ్చారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ మాజీ చైర్మన్ తారక శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి వయ్యాల కృష్ణారెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు గంగారి రమేష్, జడ్పీటీసీ సంధ్యారాణి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, ఏర్పేడు మండల ఇన్‌చార్జి గున్నేరి కిషోర్ రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనేటి రమణయ్య యాదవ్, ఎంపీపీ శ్రీనివాసులు యాదవ్, మైనార్టీ సెల్ స్టేట్ సెక్రటరీ మహమ్మద్ రసూల్, సర్పంచ్ మునిశేఖర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ హాసన్ సాహెబ్, వైస్ సర్పంచ్ ఇర్ఫాన్, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మల్లం రవికుమార్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డికి స్వాగతం పలుకుతున్న ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

సజ్జల రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం