
ఉపరాష్ట్రపతికి సాదర వీడ్కోలు
రేణిగుంట: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనం అనంతరం గురువారం మధ్యా హ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్‌కు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవె న్యూ మాజీ సెక్రటరీ ఎం హరి జవహర్, డీఐజీ షిమోషి బాజ్‌పాయ్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తదిత రులు సాదరంగా వీడ్కోలు పలికారు.
విద్యుదాఘాతంతో కౌలురైతు దుర్మరణం
కేవీబీపురం: విద్యుత్ లైటు మరమ్మతు చేస్తూ, ప్రమాదవుశాత్తు విద్యుదాఘాతానికి గురై కౌలు రైతు మృత్యువాత పడిన ఘటన కేవీబీపురం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యు లు కథనం మేరకు.. మండంలోని అంజూరు పాళెం గ్రామానికి చెందిన శివ(33) స్థానికంగా ఉన్న సుమారు ఎకరా సొంత భూమితో పాటు, మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ క్రమంలో తమ పొలంలో ఉ న్న మోటారు వద్ద ఉన్న లైటు కాలిపోయింది. దాన్ని ఇంటికి తెచ్చి, మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని శ్రీకాళహస్త్రిలోని ఒక ఆస్ప త్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెం దినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, రితిక్ (4), సుదర్శిని (2) పిల్లలు ఉన్నారు.
కార్పొరేటర్ సంధ్య ఇంట విషాదం
తిరుపతి తుడా: స్థానిక 49వ డివిజన్ కార్పొరేటర్ అన్నా సంధ్య ఇంట విషాదం నెలకొంది. గుంటూరులో బంధువుల ఇంట ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బుధవారం రాత్రి భర్త, పిల్లలతో బయలు దేరిన కార్పొరేట్ సంధ్య వాహనం ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో చిలకలూరిపేట సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో అందులో ప్రయాణిస్తున్న కార్పొరేటర్ అన్నా సంధ్య భర్త, స్విమ్స్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట కిషోర్, ఆమె కుమార్తె అశ్విత మరణించారు. దీంతో తిరుపతి కొర్లగుంటలో పెనువిషాదం నెలకొంది. అందులో ప్రయాణిస్తున్న కార్పొరేటర్ సంధ్య గాయాలతో బయటపడి చికిత్స పొందుతోంది. ఈ విషాదంపై స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు విచారం వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతికి సాదర వీడ్కోలు

ఉపరాష్ట్రపతికి సాదర వీడ్కోలు

ఉపరాష్ట్రపతికి సాదర వీడ్కోలు