
స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ పేరిట గర్భిణులపై నిర్లక
చంద్రగిరి : అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి వైద్యాధికారులు అవలంబించిన తీరుతో గర్భిణులు అవస్థ పడిన ఘటన చంద్రగిరి ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చంద్రగిరి ఏరియా ఆస్పత్రిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆరుణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని 11 గంటలు దాటిన నిర్వహించలేదు. దీంతో అప్పటికే సమీకరించిన రోగులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రి లోపల ఉన్న రోగులకు అందుబాటులో వైదాధికారులు లేకుండా అందరూ కార్యక్రమానికి వెళ్లారు. దీంతో రోగులు ఆస్పత్రిలో వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులను పడాల్సి వచ్చింది. ప్రతి గురువారం గర్భిణులకు ప్రత్యే వైద్య సేవలను అందిస్తారు. ఈ క్రమంలో గురువారం మండల వ్యాప్తంగా గర్భిణులు ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. కనీసం నిండు చూలాలకు వైద్య సేవలను అందించకుండా అధికారులు ఇతర కార్యక్రమాలకు వెళ్లడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చంద్రగిరిలో అధికారుల అత్యుత్సాహం ప్రజలకు శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి ప్రొటోకాల్ లేని వారి కోసం రోగులను ఇబ్బందులు పెట్టడం సరికాదంటూ రోగుల సహాయకులు మండిపడ్డారు.

స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ పేరిట గర్భిణులపై నిర్లక