
గంజాయి మత్తులో తిరుచానూరులో దారుణం
ఇంట్లోకి చొరబడి యువకుడిపై దాడి
హత్యాయత్నానికి దారితీసిన ప్రేమాయణం
ఇద్దరు విద్యార్థులు ఒకే యువతిని
ప్రేమించడంతో గొడవ
అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న యువకుడు
చంద్రగిరి: ఓ బృందం గంజాయి మత్తులో ఓ విద్యార్థిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం అర్ధరాత్రి తిరుచానూరులో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. తిరుచానూరుకు చెందిన తోటకూర కుహల్, దినేష్ మిత్రులు. వీరు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇద్ద రూ ఒకే యువతిని ప్రేమించారు. ఈ విషయం ఇద్దరికీ తెలియడంతో కొద్ది రోజులుగా గొడవలు పడుతున్నా రు. ఈ క్రమంలో బుధవారం కుహల్, దినేష్ మధ్య వాట్సాప్‌లో వివాదం చేసుకున్నారు. ఈ వివాదం మ రింత ముదిరింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన కుహల్ 20 మందితో కలిసి గంజాయి సేవించి, వారిని వెంటబె ట్టుకుని, తిరుచానూరు నేతాజీ రోడ్డులోని దినేష్ ఇంటికి బుధవారం అర్ధరాత్రి వెళ్లాడు. ఆపై ఇంట్లో ఉన్న దినేష్‌పై దాడికి చేశారు. తన బిడ్డపై దాడి జరగడంతో దినేష్ తల్లి అడ్డుగా రావడంతో ఆమెను సైతం చితక బాదారు. అనంతరం దినేష్‌ను బయటకు లాగి కత్తితో దాడి చేశా రు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడే కుప్పకూలి పడిపోయాడు. కడుపులో ని పేగులు బయటకు రావడంతో ఆర్తనాదాలు చేశాడు. గంజాయి మత్తులో దినేష్‌పై దాడికి పాల్పడిన అల్లరి మూకలు, కాసేపు అ క్కడే నిలబడి వీర విహారం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాసేపటికి స్థానికులు బయటకు వచ్చి రక్త పు మడుగులో పడి ఉన్న దినేష్‌ను హుటాహుటిన రు యా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దినేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు?
గంజాయి మత్తులో దినేష్‌పై హత్యాయత్నానికి పాల్పడిన యువకుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన మిగిలిన వారు పరారీలో ఉండడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కేవలం యువతి ప్రేమ వ్యవహారమే గొడవకు ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మిగిలిన నిందితుల కోసం గాలింపులను ముమ్మరం చేశారు.