
దృఢత్వానికి ప్రతీక భారతీ ఆల్ట్రా సిమెంట్
కేవీబీపురం: నమ్మకానికి, దృఢత్వానికి భారతీ ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ప్రతీకగా నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ పీ.చాయాపతి తెలిపారు. గురువారం కేవీబీపురం మండల కేంద్రంలోని టీడీఆర్ స్టీల్ అండ్ సిమెంట్ అధినేత తాటిపర్తి దశరథరామిరెడ్డి ఆధ్వ ర్యంలో తాపీమేసీ్త్రలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతీ అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. టెంపర్ ప్రూఫ్ బస్తాలతో మార్కెట్‌లోకి వస్తుండడంతో తూకంతో కూడా మార్పులు ఉండవన్నారు. సిమెంట్ రంగంలో భారతీ సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతీ సిమెంట్‌కు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగా హన కల్పించారు. అనంతరం తాపీమేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాదబీమా పత్రాలను అందజేశారు.