
బాలకృష్ణ ఒక సర్టిఫైడ్ సైకో
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి చిన్నా ధ్వజం
వరదయ్యపాళెం: శా సన సభ్యుడి హోదా లో ఉంటూ మానసిక పరిస్థితి బాగాలేక మెంటల్ సర్టిఫికెట్ ఉన్న సర్టిఫైడ్ సై కో సినీ నటుడు బా లకృష్ణ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జి ల్లాల అధికార ప్రతినిధి చిన్నా ధ్వజమెత్తారు. గురువారం చిన్నా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బా లకృష్ణ దుర్భాషలాడడాన్ని చిన్నా తీవ్రంగా ఖండించారు. దేవాలయంగా భావించే అసెంబ్లీలో కళ్ల జో ళ్లను నెత్తిన పెట్టుకుని రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వీధి రౌడీలా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో దుర్భాషలాడడం హేయ మైన చర్య అని, తక్షణమే ఆయన్ని వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చి ఆయన మానసిక ఆరో గ్య పరిస్థితి గురించి వాకబు చేయాలని సూచించారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. గతంలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన కేసులో బాలకృష్ణ మానసిక స్థితి బాగాలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నారన్నారు. వారి అంతర్గత గొడవల మధ్యకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రారంభ దశలో క్యాన్సర్ గుర్తిస్తే చికిత్సతో నయం
తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ ఎస్ లక్ష్మీ సంధ్య మాట్లాడారు. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ చికిత్సతో దాని నుంచి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలని, వ్యాయామం చేయాలని, సమతు ల ఆహారం తీసుకోవాలన్నారు. విభాగాధిపతి సుజాత, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పీ.రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.