
అక్రమ బదిలీల నిలుపుదల హర్షణీయం
తిరుపతి తుడా: విలేజ్ హెల్త్‌క్లినిక్‌ల సిబ్బంది అక్రమ బదిలీల నిలుపుదలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల్లో పనిచేస్తున్న మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఆసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మెకు తెరపడింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి బదిలీల ప్రక్రియను ఆపివేసింది. దీంతో ఆ సంఘం నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నిరవధిక నిరసన వ్యక్తం చేసిన ఆ సంఘం అధ్యక్షులు సుమన్‌బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జయచంద్ర, నాగవెంకటేష్, సమంత్, కృపావతి, జిల్లా నాయకులకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
మహిళా వర్సిటీలో నవరాత్రి వేడుకలు
తిరుపతి రూరల్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో గురువారం నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంగీతం, నృత్యం , లలిత కళల విభాగంలో ఆచార్య ఆర్‌ఎన్‌ఎస్ శైలేశ్వరి, డాక్టర్ హిమబిందుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు నవరాత్రికి సంబంధించిన అమ్మవారి భక్తి పాటల నృత్యాలతో అలరించాయి. కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ఉమ, రిజిస్ట్రార్ రజని, అధ్యాపకులు, ఇతర బోధనేతర సిబ్బంది కోలాటం ప్రదర్శించారు.

అక్రమ బదిలీల నిలుపుదల హర్షణీయం