
విపంచి ధరించి.. విహరించి..
పాలకడలిపై తేలియాడే శేషుడు తిరువీధులకు తరలివచ్చాడు. ఆపద మొక్కుల వాడికి వాహనమయ్యాడు. శ్రీహరి చిద్విలాసంగా విహరించాడు. రాయంచ సింహసం కాగా శ్రితపరిపాలకుడు వీణాపాణి ధరించి, విహరించాడు. వివేచన బోధించాడు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం చిన్న శేష, హంస వాహనాలపై మలయప్పస్వామి విహరించారు. ఈ వాహనసేవల్లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమల
చిన్న శేష వాహనంపై మలయప్ప
స్వామి

విపంచి ధరించి.. విహరించి..

విపంచి ధరించి.. విహరించి..

విపంచి ధరించి.. విహరించి..