
విష్వక్సేన వీక్షణ
ఫల పుష్ప ప్రదర్శనశాల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం నిర్వహించిన అంకురార్పణతో టీటీడీ శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి పూర్తిస్థాయి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వైఖానస ఆగమశాస్త్ర నియమబద్ధంగా వేదపండితులు అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. ఉత్సవాల ఏర్పాట్లను శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనుడు తిరువీధుల్లో ఊరేగుతూ వీక్షించారు. సేనాపతి శంఖం, చక్రం, గద, ఖడ్గం తదితర ఆయుధాలను ధరించి ఛత్ర, చామర, మంగళ వాయిద్యాలతో భేరినాదాల నడుమ తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చి వాహనంపై వైభవంగా ఊరేగారు. అంకురార్పణ క్రతువులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివీఎస్‌ఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా తిరుమల కొండ విద్యుద్దీప కాంతులతో శోభిల్లుతోంది. ఉద్యానవనంలో టీటీడీ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వాహన సేవల్లో శ్రీ మలయప్ప స్వామి ఆయా వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో వైభవంగా ఊరేగుతారు. – తిరుమల

విష్వక్సేన వీక్షణ

విష్వక్సేన వీక్షణ

విష్వక్సేన వీక్షణ