
మరో 3 రోజులు ప్రయాణ కష్టాలు
తిరుపతి అర్బన్ : ముందే ఆర్టీసీ బస్సుల కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. దానికి తోడు సీ్త్రశక్తి పథకానికి పల్లె వెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులను కేటాయించినా సరిపోవడం లేదు. మరోవైపు బుధవారం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 27, 28, 29 మూడు రోజులు వంద విద్యుత్ బస్సులను తిరుపతి–తిరుమలకు నడపనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 25న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వాలంటూ విజయవాడకు కొత్త ఉపాధ్యాయులను రావాలని ఆదేశించారు. వారి కోసం తిరుపతి నుంచి 84 బస్సులను బుధవారం ఉదయం వెళ్లేలా కేటాయించారు. దీంతో 24, 25, 26 తేదీల్లో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల కొరత తప్పేలా లేదు. 25వ తేదీ నియమాక పత్రాలు ఇచ్చినప్పటికీ మూడు రోజులు ఆర్టీసీ బస్సులు ఆ సేవలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రయాణికులు ఆ తేదీల్లో ప్రయాణానికి అవస్థలు పడాల్సిన పరిస్థుతులు నెలకొన్నాయి.