
సమ్మెకు వైద్యులు సన్నద్ధం
25న కార్యాచరణ ప్రకటిస్తాం కలెక్టర్‌కు, డీఎంహెచ్‌వోకు వినతి పత్రాన్ని ఇచ్చిన పీహెచ్‌సీ వైద్యులు
తిరుపతి అర్బన్ : ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. సమ్మెకు వెళుతున్నాం అంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యులు కలెక్టర్ వెంకటేశ్వర్‌కు తెలియజేశారు. మంగళవారం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. తమ పోరాటం ప్రజలపై కాదని...ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాత్రమేనని వెల్లడించారు. ఈ అంశాన్ని ప్రజలు కచ్చితంగా గుర్తించాలని కోరారు. గురువారం సమ్మెకు సంబంధించి కార్యాచరణ ప్రకటించి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌కు సమ్మెకు సంబంధించిన వినతిపత్రాన్ని వైద్యులు అందించారు.
ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్లు ఇవే..

సమ్మెకు వైద్యులు సన్నద్ధం