
మెడికలపై ఉక్కుపిడికిలి
విక్రయానికి వైద్యవిద్య వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యత్నాలు చంద్రబాబు రాగానే ప్రైవేటీకరణకు కుట్ర ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు జగన్ సర్కారు కృషి 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి వైఎస్ జగన్ అడుగులు
ఆందోళన చేస్తున్న వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం నేతలు, పార్టీ ప్రముఖులు
‘మెడికల్ కోర్సు చదవాలన్న పేదల కలలపై చంద్రబాబు ఉక్కుపిడికిలి బిగించారు. రాష్ట్రంలో వైద్యవిద్యను విక్రయానికి ఉంచారు. దీంతో పేదలకు వైద్యవిద్య దూరం.. సామాన్యులకు ఉచిత వైద్యం గగనం అవుతుంది. కూటమి సర్కారు దీన్ని వెంటనే ఆపాలి.’ అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నేతలు డిమాండ్ చేశారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు పేద విద్యార్థుల వైద్యవిద్య కలపై ఉక్కుపిడికిలి బిగిస్తున్నారని, దేశంలోని మెడికల్ కళాశాలల్లో ఎక్కడా పీపీపీ విధానం లేదని, చంద్రబాబు చెబుతున్న నిధుల కొరత కథ అంతా నాటకమేనని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నేత లు ధ్వజమెత్తారు. మదనపల్లె ప్రభుత్వ వైద్యకళాశా ల ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చలో మదనపల్లె మెడికల్ కళాశాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నేతలు పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయలేదని, ఒక మెడికల్ సీటు పెంచలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో రాష్ట్రంలో 2,550 మెడికల్ సీట్లు వస్తుండగా వాటిపై కూటమి నేతల దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణతో పేద, మధ్య తరగతికి విద్యార్థులు వైద్యవిద్యకు దూరం కావడమే కాకుండా, పేదలకు ఉచిత సేవలు దూరం అవుతాయని ఆవేదన చెందారు. వైద్య కళాశాలల పీపీపీ ప్రక్రియను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
చలో మదనపల్లె మెడికల్ కళాశాల భారీ సక్సెస్
ప్రభుత్వ వైద్యవిద్య పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో మదనపల్లె మెడికల్ కళాశాల కార్యక్రమం భారీ సక్సెస్ అయ్యింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు, విద్యార్థి విభాగం, యువజన విభాగం నేతలు మాట్లాడుతూ అ యినవారికి దోచిపెట్టడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు. పేదింటి బిడ్డలకు వైద్యవిద్య భారం కాకూడదని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో అప్పటి సీ ఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 నూతన వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారని చె ప్పారు. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రూ.470 కోట్లతో 95 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. కళాశాల భవన నిర్మాణాలు చాలా వరకూ పూర్తి అయ్యాయని తెలిపారు. కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు. ఏడాదిన్నరగా పనులు సాగలేదని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించారన్నారు. ఆ సమయంలోనే ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందన్నారు. పేదల ఆశలపై నీళ్లు చల్లుతూ సీఎం చంద్రబాబు ‘పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్షిప్’ (పీపీపీ) విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే చ ర్యలకు ఉపక్రమించారని తెలిపారు. ప్రైవేట్ చేతుల్లోకి మెడికల్ కళాశాలలు వెళితే పేద విద్యార్థులు ఆ వైద్య కళాశాలల గుమ్మం ఎక్కలేని పరిస్థితి తలెత్తనుండడంతోపాటు వైద్యం ఖరీదవుతుందని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీ పోరాటాలకు సిద్ధమై, శుక్రవారం యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో మదనపల్లె మెడికల్ కాలేజ్’ కా ర్యక్రమం భారీ సక్సెస్ అయ్యిందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి, మదనపల్లె ఇన్‌చార్జ్ నిస్సార్ అహమ్మద్, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, పుంగనూరు నియోజక వర్గ నేతలు శ్రీనాథరెడ్డి, అనూషరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి, విద్యార్థి విభాగం తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, యువజన విభాగం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్, పార్టీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డితోపాటు 17 నియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు. అనంతరం మెడికల్ కళాశాల భవనాలను వైఎస్సార్ సీపీ నేతలు పరిశీలించారు.
ప్రధాన భవనం వద్ద బైఠాయింపు
నిర్మాణదశలో ఉన్న ప్రధాన భవనం వద్ద విద్యార్థులు, యువకులతో కలసి వైఎస్సార్ సీపీ నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదల కలలు– ప్రభుత్వ కళాశాలలు, పేదలకు దూరంగా వైద్యం..బాబు బినామీలకు నైవేద్యం అని నినాదాలు చేశారు.
భవిష్యత్తును కాలరాస్తున్న కూటమి
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలరా స్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టగా ఇంకా రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తవుతాయి. ఈ నిధులు ఖర్చు చే యడం భారమని ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పు కుని ప్రైవేటుకు ఇవ్వాలని ప్రజలను మభ్యపెడుతోంది. దీంతో వేల కోట్లను ఆర్జించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కళాశాలలు అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులు త క్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కుతుంది. మదనపల్లె కళాశాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 99 ఎకరాలను కేటాయించింది. ఇక్కడ భవనాలు నిర్మించారు. కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ వాస్తవాలను ప్రజలను తెలియా లనే నిరసన కార్యక్రమం చేపట్టాం. చంద్రబాబు చర్యలతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది.
– భూమన అభినయ్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
జగనన్న కట్టించిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి
గత ప్రభుత్వంలో జగనన్న కట్టించిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తరువాత ఆ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూ స్తోంది. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయాలని జగనన్న సంకల్పిస్తే, తన వర్గానికి అడ్డగోలుగా కాలేజీలను కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పిస్తున్నా రు. ఇది నిజంగా పేద విద్యార్థులకు చేస్తున్న తీరని ద్రోహం. ప్రయివేటుపరం చేయబోతున్న మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న స్కాంను ప్రజల ముందుకు తీసుకువెళతాం.. ఎట్టి పరిస్థితుల్లోను ప్రైవేటు పరం కాకుండా చూ డటానికి పోరాడుతాం. ప్రభుత్వం తమ పోరాటాలను లెక్క చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న ఆ టెండర్లను రద్దు చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఆ మెడికల్ కాలేజీల జోలికి ఎవ్వరు రావద్దని హెచ్చరిస్తున్నా. – చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు

మెడికలపై ఉక్కుపిడికిలి

మెడికలపై ఉక్కుపిడికిలి

మెడికలపై ఉక్కుపిడికిలి

మెడికలపై ఉక్కుపిడికిలి