
ప్రశ్నించే పత్రికలపై అక్రమ కేసులు
కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రజావ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నించి ప్రచురించిన పత్రికలపై అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కక్ష సాధింపు చర్యలకు దిగడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే. వ్యవస్థలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుని సాక్షి ఎడిటర్, విలేకర్లతో పాటు పలు టీవీ ఛానళ్లపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే.
– బండి చలపతి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి