ప్రైవేటు.. సమ్మె సైరన్‌ ! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు.. సమ్మె సైరన్‌ !

Sep 20 2025 6:54 AM | Updated on Sep 20 2025 6:54 AM

ప్రైవ

ప్రైవేటు.. సమ్మె సైరన్‌ !

ప్రభుత్వంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలల కన్నెర్ర 22 నుంచి నిరవధిక బంద్‌కుపిలుపునిచ్చిన సంఘం రెండు రోజుల్లోపు ఫీజు బకాయిలు చెల్లించాలని డెడ్‌లైన్‌ జిల్లాలో సుమారు రూ.330 కోట్ల బకాయిలు ఎస్వీయూ అధికారులకుసమ్మె నోటీసు అందజేత

తిరుపతి సిటీ : కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు అందాల్సిన సుమారు రూ.330.15 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలికి రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అసోసియేషన్‌ ప్రభుత్వంపై కన్నెర్ర చేసింది. కళాశాలలను నిరవధికంగా మూసివేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లాలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఎస్వీయూ అధికారులకు సమ్మె నోటీసును అందజేశారు.

22 నుంచి కళాశాలలు నిరవధికంగా మూత

ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయి నిధులు రెండు రోజుల్లోపు చెల్లించాలంటూ అసోసియేషన్‌ డెడ్‌లైన్‌ విధించింది. లేనిపక్షంలో ఈనెల 22 నుంచి జిల్లాలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలను నిరవధికంగా మూసి వేసి బంద్‌ చేపట్టనున్నట్లు హెచ్చరించాయి. విద్యార్థులు, ఇటు కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం ఆటాడుకుంటోదని అసోసియేషన్‌ మండిపడింది. కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించలేక, కళాశాల నిర్వహణ వ్యయాల కోసం అప్పులు చేసి ఇప్పటి వరకు నడిపామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో సైతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందకపోవడం విద్యార్థులకు టీసీలు, మార్కుల జాబితాలు అందించలేని దుస్థితి ఏర్పడిందని, ఇటీవల ఎస్వీయూలోనే ఇలాంటి పరిస్థితి చూశామని వారు వాపోతున్నారు.

అయోమయంలో డిగ్రీ ప్రవేశాలు

జిల్లాలో ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు నిరవధిక సమ్మెలోకి వెళ్తే పరిస్థితి దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాలుగు నెలలుగా చేపట్టిన డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ఎట్టకేలకు గురువారం ప్రారంభమయ్యాయి. దీంతో డిగ్రీ తొలి విడత అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలో ప్రైవేటు కళాశాలలు సమ్మెలోకి వెళ్లి కళాశాలలను నిరవధికంగా మూసివేస్తే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారనుంది. గత ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. కనీసం 40 శాతం సైతం పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరగకపోవడంతో కళాశాలు వెలవెలబోతున్నాయి. ఈ తరుణంలో ప్రైవేటు కళాశాలలు బంద్‌కు పిలుపునివ్వడంతో డిగ్రీ ప్రవేశాలు 20 శాతం సైతం జరిగే పరిస్థితి లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

పెండింగ్‌లో ఉన్నది

6 విడతలు

(16 నెలలుగా)

కళాశాలలు నడిపే పరిస్థితి లేదు

ప్రభుత్వం 16 నెలలుగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు (ఆర్టీఎఫ్‌ నిధులు) కనీసం ఒక పైసా చెల్లించలేదు. జిల్లాలో ఒక్కో ప్రైవేటు కళాశాలకు సుమారు రూ. 3.05 కోట్లు ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం. అయినా స్పందించలేదు. సోమవారం నుంచి కళాశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల అసోసియేషన్‌ పిలుపు నిచ్చింది. జిల్లాలోని అన్ని ప్రైవేటు కళాశాలలు బంద్‌ పాటించనున్నట్లు ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడుకు సమ్మె నోటీసు అందజేశాం. వర్సిటీలో అధికారులు సమ్మె నోటీసు అందజేస్తే నిర్లక్ష్యంగా మాట్లాడటం బాధాకరం.

– పట్నం సురేంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు,ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్‌

చదువుతున్న

విద్యార్థులు

47,360

జిల్లాలో ప్రైవేటు కళాశాలలు

108

పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు

రూ. 330.15 కోట్లు

ఒక్కో విద్యార్థికి సరాసరి అందాల్సిన మొత్తం

రూ.18 వేలు

ఒక్కో కళాశాలకు అందాల్సిన బకాయిలు

రూ.3.05కోట్లు

ప్రైవేటు.. సమ్మె సైరన్‌ !1
1/1

ప్రైవేటు.. సమ్మె సైరన్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement