
పవిత్రోత్సవాలు ప్రారంభం
వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలోని టీటీడీ అనుబంధ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున సుప్రభాత సేవతో శ్రీవారిని మేల్కొలిపి శుద్ధి, తోమాల సేవ, అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. పద్మావతి, ఆండాళ్ సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యులు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. తదుపరి యోగశాలలో హోమం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
పవిత్రోత్సవాల్లో నేడు
పవిత్రోత్సవాల్లో రెండవ రోజైన గురువారం ఉద యం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆత్సవర్తకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.11.30 గంటల నుంచి 12.30 మధ్య స్వామి,అమ్మవార్లకు పవిత్రాలు సమర్పిస్తారు.

పవిత్రోత్సవాలు ప్రారంభం