
మహావిష్ణువు విగ్రహం వద్ద బందోబస్తు
తిరుపతి అన్నమయ్య సర్కిల్:తిరుపతి అలిపిరి బాలజీ బస్‌స్టేషన్ సమీపంలో పడవేసిన మహావిష్ణువు విగ్రహం వద్ద బుధవారం టీటీడీ అధికారు లు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. విగ్ర హం వద్ద మందుబాబులు పడవేసిన మద్యం బాటిళ్లతో పరిసరాలు అపవిత్రంగా చోటుచేసుకున్న అంశం వెలుగుచూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పడవేసిన విగ్రహం వద్దకు ఆకాతాయిలు, మందుబాబులు, అసాంఘిక శక్తు లు వంటివి రాకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
తుడా ప్లాట్ల వేలం పొడిగింపు
తిరుపతి తుడా: రేణిగుంట–తిరుచానూరు హైవే సమీపంలో సూరప్పకశం వద్ద శ్రీ పద్మావతి నగర్ లేఔట్‌లో ప్లాట్లకు సంబంధించి 13వ విడత ఈ–వేలానికి సంబంధించి ఈనెల 24 వరకు పొడిగిస్తున్న తుడా చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 103 ప్లాట్లు అమ్మకం జరిగి సుమారు రూ.37 కోట్ల 80 లక్షలు తుడాకు ఆదాయం లభించిందన్నారు. దీంతో 17వ తేదీన ముగియనున్న ఈ–వేలంను 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చదరపు గజం రూ.14 వేల రూపాయలు నిర్ణయించారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.