
రేణిగుంట చేరుకున్న నేపాలీ బాధితులు
రేణిగుంట: నేపాల్‌లో చిక్కుకున్న రాయలసీమకు చెందిన 40 మంది ప్రత్యేక విమానంలో సురక్షితంగా గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరారు. వీరిలో తిరుపతి జిల్లాకు చెందిన 9 మంది, వైఎస్సార్ కడపకు చెందిన 19, నెల్లూరు 5, నంద్యాల 2, అన్నమయ్య జిల్లా 3, అనంతపురం 2 మొత్తం 40 మంది పర్యాటకులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు స్వాగతం పలికి ప్రభుత్వ వాహనాల్లో స్వగ్రామాలకు తరలించారు.
శానిటరీ టెండర్‌తో
ముక్కంటి హుండీకి ఎసరు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టును అర్ధంతరంగా రద్దుచేసి, కొత్త కాంట్రాక్టరుకు అధిక మొత్తానికి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆలయ మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముక్కంటి ఆలయంలో గడువుకు ఏడాదికి ముందే టెండర్‌ను రద్దుచేసి కొత్త ఏజెన్సీకి టెండర్‌ను అధిక మొత్తానికి అప్పగించడం ంఏంటన్నారు. శానిటరీ టెండర్ విభాగంలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని పరిశీలిస్తే గతంలో శానిటరీ టెండర్‌ను యశ్వంత్ ఎంటర్‌ప్రైజెస్ నెలకు రూ.36.99 లక్షలకు టెండర్ దక్కించుకొని పనులు చేశారని, వీరికి వచ్చే ఆగస్టు 26 వరకు గడువు ఉందని గుర్తుచేశారు. అయితే ఈఓ బాపిరెడ్డి శానిటరీ టెండరును పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.76.66 లక్షలకు ఖరారు చేయడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. దీనికి 18 శాతం జీఎస్టీ కలుపుకుంటే ఒక నెలకు రూ.94.51 లక్షలు శానిటరీ టెండర్‌లోనే దేవస్థానం నిధులు వెచ్చించాల్సి వస్తుందన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆదాయాలను గండి కొట్టే విధానాలను అందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

రేణిగుంట చేరుకున్న నేపాలీ బాధితులు