వెంకటగిరి (సైదాపురం) : శక్తిస్వరూపిణి వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లికి వెంకటగిరి రాజా వారసులు, ఏపీ క్రికెట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నేత వీవీకే సర్వజ్ఞకుమార కృష్ణయాచేంద్ర బంగారు ఆభరణాన్ని పోలేరమ్మ తల్లికి బహూకరించారు. జన జాతరను పురస్కరించుకుని స్వయంగా అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఇంటి ఇలవేల్పతో పాటు మీ ఇంటి ఆడపడుచుకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. తరతరాలుగా వెంకటగిరి ప్రజలను నిత్యం పోలేరమ్మ కాపాడుతోందన్నారు.