
ప్రజాస్వామ్యానికి ముప్పు
వాస్తవాలను వెలికితీసే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, వేధించడం ప్రజాస్వామ్యానికి ముప్పు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్‌మెట్లు, ప్రసంగాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేయడం, పత్రిక, ఎడిటర్, సిబ్బందిని నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి, వేధించడం దారుణం. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికలు నిర్వీర్యమైపోతాయి. బలమున్నవాడికే జీవించే హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై న ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
– రెడ్డెప్ప, మాజీ ఎంపీ