
ఎస్పీడబ్ల్యూలో గుజరాత్ అధ్యాపకులు
తిరుపతి సిటీ : శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలను గుజరాత్ రాష్ట్రంలోని వడాలి ప్రభుత్వ కామర్స్ కళాశాల అధ్యాపకుల బృందం శుక్రవారం సందర్శించింది. పద్మావతి కళాశాల అటానమస్ సాఽధించిన తీరు, మౌలిక వసతుల కల్పనపై వారు కళాశాల అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ గుజరాత్ అధ్యాపక బృందానికి కళాశాలలో నడుస్తున్న కోర్సులు, మౌలిక వసతులపై సమాచారాన్ని అందించారు. అధ్యాపకులు డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ ఉమాదేవి, గుజరాత్ కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ డాక్టర్ కేసరిసింగ్ ఎస్ పర్మార్ పాల్గొన్నారు.