
పార్థసారథి భట్టాచార్యుల జీవితం ఆదర్శనీయం
తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీ వైఖానస ఆగమ విభాగంలో రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ప్రముఖ వైఖానస ఆగమ పండితులు టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీమాన్ రొంపిచర్ల పార్థసారథి భట్టాచార్యుల 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అకడమిక్ డీన్ ఆచార్య గోలి సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరికి చెందిన ప్రముఖ వైఖానస ఆగమ పండితులు దీవి శ్రీనివాసాచార్యులు, పార్థసారథి భట్టాచార్యులు కుమారులు శత్రుఘ్నాచార్యులు, తిరుమల వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పార్థసారథి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో తిరుగుతూ ఆ ప్రాంతాల్లోని గ్రంథాలను సంకలనం చేయడం, అనేక గ్రంథాలను పరిశీలించి వాటిని తెలుగులో ప్రచురించారని కొనియాడారు. అనంతరం శత్రుఘ్నాచార్యులు మాట్లాడుతూ తన తండ్రి సేవలు కేవలం దక్షిణ భారతదేశంలో కాదు గయాలో కూడా వారి ఫొటో పెట్టి పూజిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాఘవ దీక్షితులు, దివి శ్రీనివాస దీక్షితులు, డాక్టర్ రాజేష్, ప్రవ్వా రామకృష్ణ , సూర్యనారాయణ మూర్తి, పురుషోత్తమాచార్యులు, పరాశరం భావనారాయణాచార్యులు, పీఆర్‌ఓ డాక్టర్ బ్రహ్మాచార్యులు, పాల్గొన్నారు.