
నేడు వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ విభాగ సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి పద్మావతీపురంలోని పార్టీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీ విభాగం నేత లు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు పార్టీ ఎస్సీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర మీడియాతో మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని వివరించారు.