
13న బాక్సింగ్, లాన్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుచానూరు జెడ్పీ హైస్కూల్, తిరుపతి బైరాగిపట్టెడలోని ప్రోయేస్ టెన్నిస్ అకాడమీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో బాక్సింగ్, లాన్ టెన్నిస్ ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్, మహిళా కార్యదర్శి ఎల్.భార్గవి తెలిపారు. అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. పోటీలకు హాజరయ్యే వారు సొంత క్రీడా సామగ్రిని వెంట తెచ్చుకోవాలని, అలాగే వయసు ధ్రువీకరణపత్రం, ఇంటర్ విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ మార్కులు జాబితా తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు బాక్సింగ్‌కు సంబంధించి 98491 59147, 94418 91874, అలాగే లాన్ టెన్నిస్‌కు సంబంధించి 97007 78867నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మిలటరీ స్కూళ్లలో
ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతి సిటీ : రాష్ట్రీయ మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతిలో ప్రవేశాలకు అక్టోబర్ 9వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ స్కూల్, లేదా 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఐటీలో విప్లవాత్మక మార్పులు
తిరుపతి రూరల్ : ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రవేశపెట్టారని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం పద్మావతి మహిళా వర్సిటీలోని ధృతి ఆడిటోరియంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్–2025 సెమీఫైనల్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మహిళా వర్సిటీలో హ్యాకథాన్ సెమీస్ చేపట్టడం శుభపరిణామమన్నారు. ఐటీ నిపుణులుగా ఇతర దేశాల్లో స్థిరపడిన మన వాళ్లు తమ మేధస్సును స్వదేశంలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని వెల్లడించారు. వీసీ వి.ఉమ, రిజిస్ట్రార్ రజని, ఎస్‌ఎస్‌ఐఐఈ సీఈఓ సూర్యకుమార్ పాల్గొన్నారు.