
104 వాహన డ్రైవర్ సస్పెన్షన్
డక్కిలి : డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తిరుపతి జిల్లా ఎయిడ్స్, లెప్రసీ అండ్ టీబీ అధికారి , జిల్లా అదనపు డీఎం అండ్ హెచ్‌ఓ అధికారిణి డాక్టర్ శైలజ మంగళవారం విచారణ చేపట్టారు. ఈనెల 9న మంగళవారం అర్ధరాత్రి మందులు మాయం అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. దీనిపై జిల్లా డీఎంహెచ్‌ఓ ఆదేశాలు మేరకు అదనపు డీఎంహెచ్‌ఓ పీహెచ్‌సీలో వైద్యాధికారులతో విచారణ చేపట్టారు. పీహెచ్‌సీ ఆవరణలోని గోడౌన్‌లో ఉన్న మందులు కేవలం 104కి మాత్రమే చెందినవని, డక్కిలి పీహెచ్‌సీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.104 వాహన డ్రైవర్ కాలం చెల్లిన మందులను ట్రాక్టర్‌లో తీసుకెళ్లడం ఆదివారం జరిగిందన్నారు. ఈ మందులను ఆదివారం 6–30 గంటల సమయంలో తీసుకెళ్లడంతో సిబ్బందికి ఎవ్వరికీ తెలియదన్నారు. ఇటువంటి సంఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా వైద్యాధికారులు , సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. విచారణ పూర్తయ్యే వరకు 104 వాహన డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లుగా 104 జిల్లా మేనేజర్ రాజేష్ వివరించారు. జరిగిన ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి , విచారణ నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం మందుల తరలింపుపై వైధ్యాధికారులతో వివరించగా విచారణ జరిపారు. విచారణ నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యఖాధికారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విచారణలో వైద్యాధికారులు శ్రీహరి, బిందు ప్రియాంక, వైద్య సిబ్బంది ఉన్నారు.

104 వాహన డ్రైవర్ సస్పెన్షన్