
ఎస్వీయూ నిరాకరణ!
తిరుపతి సిటీ : పీజీ సెట్–25 అడ్మిషన్ల ప్రక్రియపై ఉన్నత విద్యామండలి వ్యవహారశైలిపై ఎస్వీయూ అసహనం వ్యక్తం చేసి నిరాకరించింది. దీంతో ఆ బాధ్యతలను నాగార్జున వర్సిటీకి అప్పగించారు. ఆ యూనివర్సిటీ సైతం తాము చేపట్టలేమని తెగేసి చెప్పినా కాళ్లవేళ్లా పడటంతో ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాగార్జున వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రవికుమార్‌కు కౌన్సెలింగ్ కన్వీనర్‌గా నియమించారు.
పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన విధంగా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఉమ్మడి పద్ధతిలోనే ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. ఎట్టకేలకు పీజీ ప్రవేశాల ప్రక్రియకు సన్నద్ధమయ్యారు. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసి పదిరోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది
నోటిఫికేషన్ విడుదల వివరాలు
పీజీసెట్–2025 అడ్మిషన్ల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు పీజీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉండనుంది. సీట్లు పొందిన విద్యార్థులు 22 నుంచి 24వ తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.