
సమాజ జాగృతిలో గురువులే కీలకం
తిరుపతి కల్చరల్ : సమాజ జాగృతిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధతో వారి ఉన్నతికి బాటలు వేయాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కచ్చపి ఆడిటోరియంలో శుక్రవారం గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు వృత్తిపరంగా కాకుండా విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ ఉన్నప్పుడే వారి మధ్య బంధం పెరుగుతుందని, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, 50 కోట్ల బడ్జెట్ కేవలం విద్యాభివృద్ధి కోసం ఖర్చు పెడుతోందని తెలిపారు. ఉపాధ్యాయులందరూ కష్టపడి పని చేస్తున్నారని, విద్యార్థులకు రోల్ మోడల్‌గా ఉండాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, భానుప్రకాష్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపాధ్యాయులే మార్గదర్శకులన్నారు. అనంతరం శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం మాట్లాడారు. ఈ సందర్భంగా 68 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులగా అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్లు, జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్.కుమార్, అడిషనల్ కో ఆర్డినేటర్ గౌరీ శంకర్‌రావు, సమగ్ర శిక్ష సీఎంవో సురేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.

సమాజ జాగృతిలో గురువులే కీలకం

సమాజ జాగృతిలో గురువులే కీలకం