
అమ్మవారి సేవలో తెలంగాణ సీజే
చంద్రగిరి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, శాంతారాం స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని, అనంతరం అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీర్థ ప్రసాదాలను అందజేశారు.