
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
విజయవాడ: గురుపూజోత్సవం సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు.
వరసిద్ధుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన భాగ్యం కల్పించి ఆలయ మర్యాదలు చేశారు. అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రేష్, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర గ్రీన్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ దర్శించుకున్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం