
అమ్మవారికి వెండి తుంగవళి దీపాలు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి భక్తులు వెండి తుంగవళి దీపాలను విరాళంగా అందజేశారు. దాతలు బుధవారం వాటిని ఆలయ ఏఈఓ దేవరాజులకు అందజేశారు. కెనడాకు చెందిన రమణారావు దంపతులు సుమా రు రూ.6 లక్షల విలువ చేసే 4.144 కిలోల వెండి తుంగవళి దీపాలను తయారు చేయించారు. వాటిని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు దాతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాబు స్వామి, ఆలయాధికారులు పాల్గొన్నారు.
ఆధునిక సమాజానికి దిక్సూచి సంస్కృతం
తిరుపతి సిటీ: ఆధునిక సమాజానికి సంస్కృతం దిక్సూచి అని అక్షరపురుషోత్తమధామం అధ్యక్షుడు స్వామిభద్రేశ దాస్ పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో సంస్కృత వారోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఆయన వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తితో కలసి ప్రారంభించి, ప్రసంగించారు. సంస్కృతం భారతీయ జ్ఞానసంపదకు మూలమన్నారు. సంస్కృతాన్ని ఆధునిక సమాజానికి మరింత చేరువచేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృతంతోనే సమాజంలో ఉత్తమ సంస్కారులుగా గుర్తింపు పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి సమ్మాన గ్రహీత, ప్రొఫెసర్ .కొంపెల్ల రామసూర్యనారాయణ, రిజిస్ట్రార్ వెంకటనారాయణ రావు, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, డాక్టర్ భారతి భూషణరథ్, డాక్టర్ ప్రదీప్ కుమార్ బాగ్, డాక్టర్ ఉదయాన హెగ్డే పాల్గొన్నారు.

అమ్మవారికి వెండి తుంగవళి దీపాలు