
విద్యుత్‌షాక్‌తో రైతు మృతి
పెళ్లకూరు: మండలంలోని నందిమాల గ్రామానికి చెందిన పేరువాయి మునెయ్య(55) అనే రైతు మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. నందిమాల గ్రామానికి చెందిన మునెయ్య పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫీజులు పోయాయి. దీంతో సరఫరా ఆగిపోయింది. ప్యూజ్ కాలిపోయిన విషయం గ్రహించిన మునెయ్య కర్ర సాయంతో ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫ్యూజు వేసే ప్రయత్నం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి మృతదేహాన్ని గ్రామంలోని అతని నివాసానికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య జయలక్ష్మి, కూమార్తె చైతన్య,కుమారుడు శశికుమార్ ఉన్నారు.
రైలు నుంచి జారి పడి మహిళ మృతి
పాకాల: ప్రయాణిస్తున్న రైలు నుంచి మహిళ జారి పడి మృతి చెందిన సంఘటన దామలచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. కదిరి రైల్వే పోలీసుల కథనం మేరకు.. టీటీపల్లి పంచాయతీ, వలపలవారిపల్లి సమీపంలో మంగళవారం రైలు నుంచి జారి పడి సుమారు 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఆమె చేతిపైన రామక్క, పార్వతి అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కదిరి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి