
మఠం భూముల జోలికి వస్తే క్రిమినల్ కేసులు
తిరుపతి రూరల్: మండలంలోని గాంధీపురం పంచాయతీ అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13 లోని హథీరాంజీ మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు తప్పవని మఠం సూపరింటెండెంట్ కేశవులు హెచ్చరించారు. మంగళవారం ఆయన మఠం భూముల్లో కడుతున్న అక్రమ కట్టడాలను పరిశీలించి, ఆక్రమణదారులతో చర్చించారు. అసలు మఠం భూముల్లో ఇళ్లు కట్టే అధికారం ఎవరిచ్చారని ఆరా తీయగా తమకు రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పడంతో ఆ సర్వే నంబర్‌లో ఎక్కడా రిజిస్ట్రేషన్లు జరగలేదని తేల్చి చెప్పారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలు చేత పట్టుకుని రూ.కోట్ల విలువైన మఠం భూములు కాజేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మఠం భూముల్లో గొడవలు జరిగితే అందరిపైనా పోలీసులు కేసులు పెడతామని హెచ్చరించారు. ఆయన ల్యాండ్స్ క్లర్క్ సీతారామయ్య, ఉన్నారు.