
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
తిరుపతి అర్బన్ : సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా అధికారులు పనిచేయాలని జేసీ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 302 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డీఆర్‌ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోస్మాండ్, దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు..
ప్రతి అర్జీని పరిష్కరిస్తాం : ఎస్పీ
ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి తగు న్యాయం చేస్తామని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడించారు. సోమవారం తిరుపతిలోని ఎస్పీ కార్యాలయానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 102 అర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీలు రవిమనోహరచారి,నాగభూషణం, డీఎస్పీ వెంకటనారాయణ, సాధిక్ ఆలీ, సీఐలు శ్రీనివాసులు, మురళికృష్ణ,నాగార్జునరెడ్డి,హరిప్రసాద్,శ్రీరాములు, మంజునాథ్‌రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.