
అబద్ధాలతోనే ‘నాని’ రాజకీయం
● ఎమ్మెల్యే అయినా తీరుమారలేదు ● మండిపడిన వైఎస్సార్‌సీపీ నేతలు
చంద్రగిరి: ఎమ్మెల్యే పదవి కోసం గత ఎన్నికల సమయంలో పులివర్తి నాని అబద్ధాలతో రాజకీయం చేశారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి నేతలు మండిపడ్డారు.ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేయించారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన చిల్లర బ్యాచ్‌తో దాడులకు పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. సోమవారం వారు చంద్రగిరిలోని ఓ కల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రగిరి చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఏడాది పాలనలో సుమారు 50 మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులు చేయించారన్నారు. పల్లెల్లో జరిగే రాజకీయ గొడవలు, హత్యాయత్నాల కారణంగా చంద్రగిరి పరువుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని చెవిరెడ్డి చెప్పడం వల్లే మీరు కూడా ప్రశాంతంగా పల్లెల్లో తిరుగుతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. చెవిరెడ్డిపై మీరు చేస్తున్న అసత్య ఆరోపణలను రుజువు చేసే దమ్ముందా అని నిలదీశారు. అడుగడుగునా అవినీతి, అక్రమాలకు తెరలేపి రూ.కోట్ల ప్రజాధనం దోచేస్తున్నారని ఆరోపించారు.
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ముందుగా సేనాధిపతిని ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం చేపట్టారు. పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు జరిపించారు. టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
భాకరాపేట: శేషాచల అడవుల్లోని భాకరాపేట అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి వచ్చిన రహస్య సమాచారం మేరకు అయ్యగారిపల్లి సమీపంలో అనుమానిత కారు రావడంతో తనిఖీ చేయగా అందులో 9 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు. వెంటనే ఎర్రచందనం దుంగలను కారును, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని భాకరాపేట అటవీ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.11 లక్షలు ఉంటుందని తెలిపారు. మరియు కార్ డ్రైవర్ తమిళనాడు వాసి ప్రకాష్ శక్తివేల్‌గా గుర్తించారు. మరొకరు పారిపోగా పోలీసులు గాలిస్తున్నారు. భాకరాపేట రేంజ్ అటవీ క్షేత్రాధికారి ఎన్ వెంకటరమణ, బి మునిస్వామి నాయక్ ఎఫ్‌ఎస్‌ఓ, వై రాజేష్ కుమార్, ప్రదీప్ చాంద్, కె లక్ష్మీప్రసాద్ ఎఫ్‌బీఓలు శంకర్, రోహిత్ పాల్గొన్నారు.

అబద్ధాలతోనే ‘నాని’ రాజకీయం

అబద్ధాలతోనే ‘నాని’ రాజకీయం