
అద్భుతం.. అభినయోత్సవం
తిరుపతి కల్చరల్ : అభినయ ఆర్ట్స్ జాతీయ నాటక పోటీలలో భాగంగా మహతి కళాక్షేత్రంలో గురువారం ప్రదర్శించిన శాసీ్త్రయ, జానపద నృత్యాలు, పౌరాణిక, సాంఘిక నాటికలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. మధిర శ్రీసుమిత్ర యూత్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన శ్రీయయాతిశ్రీ పౌరాణిక పద్యనాటకం సందేశాత్మకంగా సాగింది. చైతన్య కళాభారతి వారు ప్రదర్శించిన శ్రీ స్వప్నం రాల్చిన అమృతంశ్రీ సాంఘిక నాటిక వీక్షకులను చైతన్యపరిచింది. గురజాడ కళామందిర్ వారు ప్రదర్శించిన శ్రీమహాప్రస్థానం శ్రీ సాంఘిక నాటిక అలరించింది. ఈ సందర్భంగా కళాకారులను అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బీఎన్ రెడ్డి ఘనంగా సత్కరించారు.

అద్భుతం.. అభినయోత్సవం