
జర్మనీ భాషపై ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్: నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాషపై ఉచితంగా శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన శుక్రవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, ఎమ్మెల్సీ కల్యాణ చక్రవర్తితో కలిసి శిక్షణకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనన్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం తదితరులు పాల్గొన్నారు.