
టిప్పర్ బోల్తా
డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు
నాయుడుపేటటౌన్: పట్టణ సమీపంలోని జాతీయ రహదారిలో ఉన్న రింగ్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి టిప్పర్ గురువారం తెల్లవారు జామున అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న గూడూరు ప్రాంతానికి చెందిన డ్రైవర్ , క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. గూడూరు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న ఖాళీ టిప్పర్ నాయుడుపేట సమీపంలో 71 నంబర్ జాతీయ రహదారి రింగ్ రోడ్డు బ్రిడ్జిపైకి వచ్చేసరికి అదుపు తప్పి సుమారు 30 అడుగులకు పైనుంచి కింద పడిపోయింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్ క్యాబిన్‌లో ఇరుక్కొన్న డ్రైవర్ ఎం హరి, క్లీనర్ ఎస్ వెంకటేశ్వర్లు బయటకు తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.