
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
రేణిగుంట: సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీన తిరుపతి పర్యటన ఉన్న నేపథ్యంలో విమానాశ్రయంలో ముందస్తు ఏర్పాట్లపై గురువారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎటువంటి లోపా లు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పి శ్రీనివాసరావు, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు జయచంద్ర, మంజునాథరెడ్డి, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌యూను సందర్శించిన మాడభూషి
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీని మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ప్రస్తుతం మహేంద్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా డీన్ మాడ భూషి శ్రీధర్ గురువారం సందర్శించారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, పలు విభాగాల అధ్యాపకులతో సమావేశమ య్యారు. సంస్కృత అధ్యయనం, బోధన, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూజీ, పీజీ కోర్సుల నిర్వహణపై ఆరా తీశారు. యోగా విభాగంలో విద్య నభ్యసిస్తున్న విద్యార్థుల ప్రతిభను ప్రత్యక్షంగా చూసి, అభినందించారు. సెంట్రల్ లైబ్రరీ, ల్యాబ్‌లను సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృత జ్ఞానాన్ని, ఆధునిక పరిజ్ఞానం, టెక్నాలజీతో సమన్వయం చేసి ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. ఆయనతో పాటు వర్సిటీ పీఆర్‌ఓ ప్రొఫెసర్ రమేష్ బాబు, ఏపీఆర్‌ఓ డాక్టర్ కనకాల కుమార్, డాక్టర్ మాధవరావు, డాక్టర్ శేఖర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రపంచ మామిడి దినోత్సవానికి తరలిరండి
తిరుపతి కల్చరల్: మామిడి రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రపంచ మామిడి దినోత్సవం కార్యక్రమానికి జిల్లాలోని రైతులందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని మామిడి రైతు సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ టి.జనార్దన్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రామానాయుడు పిలుపునిచ్చారు. గురువారం గంధమనేని శివయ్య భవన్‌లో వారు ప్రపంచ మామిడి దినోత్సవం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సీజన్‌లో మామిడి రైతుల చేతికి అందిన పంట అమ్ముకోవడానికి పడిన కష్టాలు అలివకానివన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష