
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం రేపు
● ఐఐటీలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఏర్పేడు: మండలకేంద్రం సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో శనివారం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్‌పీ హర్షవర్థన్‌రాజు ఐఐటీ ప్రాంగణంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ భవనాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన ముందస్తు భద్రతా చర్యలను గురించి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా జేసీ శుభం బన్సల్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి పాల్గొన్నారు.