
ప్రధానోపాధ్యాయులకు ముగిసిన శిక్షణ
తిరుపతి రూరల్ : మండలంలోని కేసీపేట పరిధిలోని మెడ్‌జీ స్కూల్ ఆవరణలో లీడర్‌షిప్‌పై ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ గురువారంతో ముగిసింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న 916 మంది ప్రధానోపాధ్యాయులను మూడు బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. మొదటి విడత ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకరరావు, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శివశంకరయ్య, ఎంఈఓ భాస్కర్‌బాబు, ఏఎస్‌ఓ సారథి, ఏపీఓ సుధాకర్, మాస్టర్ ఫెసిలిటేటర్లు పాల్గొన్నారు.
చైర్‌పర్సన్ల నియామకం
చిత్తూరు అర్బన్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు– వయ్యాసి ఝాన్సీరాణి, గూడూరు – చిల్లకూరు నీరజ, పెనుమూరు– ఎర్రగుంట్ల కృష్ణమనాయుడు, రొంపిచెర్ల – కొండా సుజాత,సూళ్లూరుపేట – ఆకుతోట రమేష్, తిరుచానూరు – ఊరుబిండి మౌనిక, వాకాడు – మర్రి ప్రమీల, వెంకటగిరి – పునుగోటి విశ్వనాథ్, నాయుడుపేట – ఉయ్యాల ప్రవీణ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.