రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jul 13 2025 4:29 AM | Updated on Jul 13 2025 4:41 AM

రేణిగుంట : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో ఏర్పేడు మండలానికి చెందిన భాస్కర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు గాజులమండ్యం ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మర్రిగుంట సర్కిల్‌ నుంచి విమానాశ్రయ రహదారి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో ఏర్పేడు మండలం కాట్రకాయ గుంట గ్రామానికి చెందిన రత్నయ్య కుమారుడు భాస్కర్‌ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి గాజుల మండ్యం పోలీసులు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వైస్‌ ఎంపీపీ సరోజని మృతి

సత్యవేడు: మండలంలోని మదనంబేడు పంచాయతీకి చెందిన వైస్‌ ఎంపీపీ(వైఎస్సార్‌సీపీ) డి.సరోజని శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మండలం, పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆమె మృతి పార్టీకి తీరనిలోటని జెడ్పీటీసీ పి.విజయలక్ష్మీ, సర్పంచ్‌ ఎస్‌.శివరంజని తదితరులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

అర్చకులకు రూ.5 వేలు

తిరుపతి అర్బన్‌: ధూపదీప నైవేద్యాల సమర్పణకు అర్చకులకు రూ.5 వేలు అందిస్తున్నట్లు జిల్లా దేవదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు. టీటీడీ సహకారంతో శ్రీవాణి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నూతన ఆలయాల నిర్మాణం కోసం రూ.10 లక్షలు అందిస్తున్న నేపథ్యంలో అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 130 ఆలయాలకు నిధులు ఇచ్చినట్లు చెప్పారు. గుర్తింపు పొందిన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు రూ.15 వేలు ఇస్తున్నట్లు వివరించారు.

రైల్వే స్టేషన్‌లో 12 కిలోల గంజాయి పట్టివేత

గూడూరు రూరల్‌ : గూడూరు రైల్వే స్టేషన్‌లోని 4వ నంబర్‌ ప్లాట్‌ఫారం చివరన అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని గూడూరు రైల్వే పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి రూ.1.20 లక్షలు విలువ చేసే 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే సీఐ సుధాకర్‌ తెలిపారు. ఈ మేరకు నెల్లూరులోని రైల్వే డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీధర్‌ వివరాలను వెల్లడించారు. నిషేధిత మాదక ద్రవ్య రవాణా నిరోధానికి ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్‌కు చెందిన హరిహరన్‌ అనే వ్యక్తి టాటానగర్‌– ఎర్నాకుళం జంక్షన్‌ ఎక్స్‌ప్రెస్‌లో గూడూరు రైల్వే స్టేషన్‌లో దిగి అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో నెల్లూరు రైల్వే ఎస్‌ఐ మాలకొండయ్య, రైల్వే పోలీసు సిబ్బంది రవి, వెంకటేశ్వర్లు, కిరణ్‌ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 1
1/2

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 2
2/2

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement