
ముగిసిన గ్రాప్లింగ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని గిరిజన భవన్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రాప్లింగ్ రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది. సబ్ జూనియర్స్, క్యాడెట్ (బాయ్స్ అండ్ గర్‌ల్స్) విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. సబ్ జూనియర్స్ విభాగంలో 20మంది బాలురు, 20మంది బాలికలు, అలాగే క్యాడెట్ విభాగంలో 10మంది బాలురు, 10మంది బాలికలు, మొత్తం 60మంది రెజ్లర్లను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి గ్రాప్లింగ్ పోటీల్లో ఏపీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో ఒక్రీడా భారతి అధ్యక్షుడు ఎంవీ.మాణిక్యాలు, కార్యదర్శి పి.ధనంజయరెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేంద్రరెడ్డి, విశ్వం విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఏజీ రేఖారాణి పాల్గొన్నారు.