
మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 48 మంది న్యాయవాదులు, సంఘ సేవకులకు మధ్యవర్తిత్వం, ఇతర అంశాలపై గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, మధ్యవర్తిత్వ కేంద్రం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి భారతి ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ అనూజ సక్సేన, మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాది, సంఘ సేవకురాలు నీనా కరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి భారతి ఇద్దరు న్యాయవాదులను సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయవాదులు, సంఘ సేవకులు పాల్గొన్నారు.
20న ఐఐటీ 7వ స్నాతకోత్సవం
ఏర్పేడు:ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ లో ఈనెల 20వ తేదీన 7వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తి చేసిన 417 మంది విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలను అందించనున్నారు. ముఖ్య అతిథిగా కాగ్నిజెంట్ కో ఫౌండర్ లక్ష్మీనారాయణన్, జేఎస్‌డబ్ల్యూ ఎండీ సజ్జన్ జింధాల్ హాజరై విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిషేధిత వస్తువులపై
191 కేసులు
తిరుపతి క్రైమ్ : జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు నిర్వహించిన నిషేధిత వస్తువుల స్పెషల్ డ్రైవ్‌లో గురువారం రాత్రి వరకు 191 కేసులు నమోదు అయినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొ న్నారు. స్కూళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాలలో నిషేధిత వస్తువులైన గుట్కాలు, సిగరెట్లు విక్రయించిన వారిపై 200 రూపాయల చొప్పున జరి మానాలు విధిస్తున్నామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇకపై నిరంతరం జరుగుతుందని పేర్కొన్నారు.