
సర్కార్‌కు రైతులంటే చులకన
కూటమి సర్కార్‌కు రైతు లంటే చులకనగా ఉంది. దాంతోనే వారి సమస్యలను అసలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగా అన్న మహానుభావుడు. ఈ నేపథ్యంలోనే గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నా, వారిని పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నేత కర్షకులను పరామర్శించడం ఎంతో నేరంగా భావిస్తున్నారు. దానికితోడు చంద్రబాబు కు అనుకూలంగా ఉన్న మీడియా రైతులను దండుపాళెం బ్యాచ్‌గా చిత్రీకరిస్తూ కథనాలు రాయడం మరింత దారుణంగా భావిస్తున్నాం. పత్రికలు ప్రజల పక్షాన పనిచేయాల్సి ఉందే తప్ప.. కూటమి సర్కార్ వైపు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం.
– బాలయ్య, రైతు, వాకాడు మండలం
●