
పోలీస్‌స్టేషన్‌కు బారికేడ్ల వితరణ
శ్రీకాళహస్తి: వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు భారతి సిమెంట్ కంపెనీ వారు సోమవారం 30 బారికేడ్లను వితరణగా అందించారు. భారతి సిమెంటు కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ పి.రాజు, లోకల్ డీలర్ శ్రీబాలాజీ ఎంటర్‌ప్రైజస్ అధినేత ఎం.నరసింహారెడ్డి చేతులమీదుగా సీఐ గోపీకి బారికేడ్లు అప్పగించారు. రాజు మాట్లాడుతూ సామాజిక బాధ్యతలో భాగంగా భారతి సిమెంట్ తరఫున ఏటా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముక్కంటి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లు అందించినట్లు వివరించారు.
సూళ్లూరుపేటలో..
సూళ్లూరుపేట : పట్టణంలో ట్రాపిక్ నియంత్రణకు 6 బారికేడ్లను భారతీ సిమెంట్ కంపెనీ వారు సోమవారం వితరణగా అందించారు. కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ మల్లికార్జున్‌రెడ్డి, స్థానిక డీలర్ బద్దెపూడి ధనంజయరెడ్డి చేతులమీదుగా ఎస్‌ఐ బ్రహ్మనాయుడుకు అప్పగించారు.

పోలీస్‌స్టేషన్‌కు బారికేడ్ల వితరణ