
ఉద్యానం.. అధ్వాన్నం!
ఈ ఫొటోలోని రైతు పేరు వరప్రసాద్‌రాజు, సైదాపురం మండలం, లింగసముద్రం గ్రామం. పదెకరాల్లో సుమారు 1,100 నిమ్మచెట్లు సాగు చేశాడు. ప్రతి ఏటా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు గిట్టుబాటయ్యేది. కానీ ఈ యేడు కనీసం పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్నాడు. సీజన్‌లోనూ నిమ్మకాలు అడిగే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం పెట్టబడి సాయం అందించి ఉంటే కొంతవరకై నా అప్పులు తీరేవని చెబుతున్నాడు.
ఈ ఫొటోలోని రైతు పేరు కుంచం సుబ్బయ్య. ఊరు సైదాపురం. గ్రామంలో ఐదెకరాల వరకు కౌలుకు తీసుకుని ప్రతి ఏటా వ్యవసాయం చేస్తున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నాడు. ఈ ఐదెకరాల్లో ఈ ఏడాది 20 పుట్ల ధాన్యాన్ని పండించాడు. సరైన గిట్టుబాటు ధరలేక.. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గిడ్డంగి సౌకర్యం లేక రోడ్డుపైనే పోసి నిరీక్షించాడు. చివరకు విధిలేని పరిస్థితుల్లో పుట్టి రూ.17 వేలకు తెగనమ్ముకున్నాడు. అదే పుట్టి గత ఏడాది రూ.24 వేల వరకు విక్రయించినట్టు పేర్కొంటున్నాడు. ఈ యేడు పెట్టుబడి ఎక్కువ.. గిట్టుబాటు తక్కువని లబోదిబోమంటున్నాడు.
.. జిల్లాలో ఈ ఇద్దరి రైతుల పరిస్థితే కాదు.. ప్రతి రైతుదీ ఇదే దుస్థితి. సరైన దిగుబడి లేక..
పెట్టిన పెట్టుబడి చేతికందక.. ప్రభుత్వం ఆదుకోక అప్పుల పాలవ్వాల్సి వచ్చింది.

ఉద్యానం.. అధ్వాన్నం!