
స్వచ్ఛాంధ్రలో భాగస్వాములవ్వాలి
నాయుడుపేటటౌన్ : స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం నాయుడు పేట పట్టణంలో కలెక్టర్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, , ఆర్డీఓ కిరణ్మయి, మున్సిపల్ చైర్‌పర్సన్ దీపికతో కలిసి స్వచ్ఛాంధ్రలో భాగంగా విభిన్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గోమతి సెంటర్ వద్ద కలెక్టర్ మొక్కలు నాటారు. అక్కడ నుంచి పట్టణంలోని గాంధీపార్కు వద్దకు చేరుకొని పార్కులోని చెట్ల వద్ద వేసవి కాలంలో పక్షులకు ఆహార ధాన్యాలు, మంచి నీటి వసతిని కల్పించేలా మట్టి పాత్రలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని పడమటి వీధి తదితర చోట్ల చలువ పందిళ్లను కలెక్టర్ పరిశీలించి అక్కడికి వచ్చిన వారికి మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం పలు సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో తహసీల్దారు రాజేంద్ర, కమిషనర్ షేక్ ఫజులుల్లా, ఎంపీడీఓ సురేష్‌బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు రాజేష్, గంగా ప్రసాద్, చెంగయ్య, ధనుంజయ పాల్గొన్నారు.