
వేసవిలో తరగతుల నిర్వహణపై ఫిర్యాదు
తిరుపతి అర్బన్ : ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినా జిల్లాలోని సగం ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవడం లేదని భారత విద్యార్థి ఫెడరేషన్ నేతలు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో గురువారం విద్యార్థి సంఘం నేతలు జేసీని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు నిర్వహిస్తున్న వేసవి తరగతులతో పాటు వసతులు లేని కళాశాలల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు భగత్ రవి, వినోద్, తేజ, శివ పాల్గొన్నారు.